చర్చి చరిత్రPost Date:2013-09-06//No:3

మెదక్ చర్చి

మెదక్
ఇది ఆసియాలోనే అతి పెద్దది. ప్రపంచంలో వాటికన చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి చార్లెస వాకర పోస్నెట, ఈ చర్చి నిర్మాణం తలపెట్టి, ఈ చర్చి నిర్మాణం, 1914 నుండి 1924 వరకు కొనసాగింది.
మొదటి ప్రపంచయుద్ధ కాలం లో, మెదక జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ, రెవెరెండ . చార్లెస వాకర పోస్నెట, చర్చి నిర్మాణం తలపెట్టి, "పనికి మెతుకులు పథకం" ప్రవేశపెట్టాడు - " గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో, వారికి ఆహారం ఇవ్వబడుతుంది." "మెతుకులు" అనగా అన్నం, అందుకే ఆ ప్రాంతానికి "మెదక్" అని పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం, 1914 నుండి 1924 వరకు కొనసాగింది. ఇది ఆసియాలోనే అతి పెద్దది. ప్రపంచంలో , వాటికన చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ హార్డింగ. పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం, ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి, మేస్త్రీలను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వారానికొకసారి, నేలను, అద్దాలను కిరోసిన కలిపిన కొబ్బరినూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై వ్రాయబడిన వాక్యాలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలలో కనిపిస్తాయి. మొదట వాక్యాలు హిందీలో లేవు. పండిట జవహర్‌లాల నెహ్రూ సోదరి, విజయలక్ష్మి పండిట ఈ చర్చిని సందర్శించినప్పుడు, జాతీయభాష అయిన హిందీలో వ్రాయించింది.